పవన్ కళ్యాణ్ ఈ ఏడాది కూడా కనపడే ఛాన్స్ లేదా……??

 187 total views,  1 views today

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓవైపు వకీల్ సాబ్ తో పాటు మరోవైపు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మరొక సినిమా చేస్తున్నారు. వకీల్ సాబ్ లో పవర్ఫుల్ లాయర్ పాత్రలో నటిస్తున్న పవన్, క్రిష్ సినిమాలో ఒక గజదొంగగా నటిస్తున్నట్లు టాక్. ఇకపోతే వకీల్ సాబ్ ని వాస్తవానికి ఈ నెల సెకండ్ వీక్ లో రిలీజ్ చేద్దాం అని భావించింది సినిమా యూనిట్. అయితే హఠాత్తుగా ఈ కరోనా మహమ్మారి వలన దేశం మొత్తం లాక్ డౌన్ అవడంతో అన్ని రంగాలు మూతబడడంతో ఎక్కడి షూటింగ్స్ అక్కడే నిలిచిపోయాయి. దానితో వకీల్ సాబ్ కూడా ఆగిపోయింది.

Power Star To Work From Home For Vakeel Saab

ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మిగతా పార్ట్ ని ఫినిష్ చేయడానికి మరికొంత సమయం పడుతుందని, అయితే లాక్ డౌన్ అనంతరం ఇతర సినిమాలు రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేయడానికి సిద్ధం అవుతుండడంతో, ఇప్పట్లో తమ సినిమాని రిలీజ్ చేయడానికి ఇష్టపడని నిర్మాతలు దిల్ రాజు, బోనీ కపూర్ ఇద్దరూ కలిసి వచ్చే ఏడాది జనవరి కి వకీల్ సాబ్ ని రిలీజ్ చేద్దాం అని భావిస్తున్నారట. ఈ లాక్ డౌన్ తో మరోవైపు ఆర్ఆర్ఆర్ కూడా నిలిచిపోవడంతో అది రాబోయే వేసవికి వాయిదా పడే అవకాశం గట్టిగా ఉందని, అందుకే వకీల్ సాబ్ ని జనవరి లో రిలీజ్ చేయాలనీ నిర్ణయించాట్లు టాక్. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే ఈ ఏడాది కూడా పవన్ ను సినిమా రానట్లే….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *