178 total views, 1 views today
టాలీవుడ్ మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిరోజు పండగే సినిమాతో మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒక వినూత్న కథాంశంతో తెరకెక్కుతున్న సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో నటిస్తున్న సాయి ధరమ్ తేజ్, ప్రస్తుతం లాక్ డౌన్ సందర్భంగా ఇంట్లో వారితో సారధిగా గడుపుతున్నారు.
ఇక నేడు ఒక ఇంటర్వ్యూ లో భాగంగా మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అభిమానులు అడుగుతున్నారు, దీనికి మీ సమాధానం ఏంటి అని అడగ్గా, దానికి సాయి తేజ్ మాట్లాడుతూ, తనకు ప్రస్తుతం 33 ఏళ్ళు వచ్చాయని, అయితే కెరీర్ పరంగా చేయాల్సిన సినిమాలపైనే ఎక్కువగా తన దృష్టి కేంద్రీకృతం అయి ఉందని, అందువలన తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని లేనప్పటికి ఇంట్లో వాళ్ళు మాత్రం మనల్ని వదలరు కదా, వాళ్ళ పని వాళ్ళు చేస్తూ సంబంధాలు మాత్రం చూస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. దీనిని బట్టి ఇప్పటికిప్పుడు కాకపోయినా, అతి త్వరలోనే సాయి ధరమ్ తేజ్ పల్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది…..!!