248 total views, 1 views today
మహేష్ బాబు హీరోగా అతి త్వరలో సర్కారు వారి పాట సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ కలిసి సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనుండగా థమన్ సంగీతం అందించనున్నాడు.
ఇకపోతే దీని తరువాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మించనున్న సినిమాలో మహేష్ నటించనున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో హీరోయిన్ గా ఇప్పటికే బాలీవుడ్ నటి దీపికా పదుకొనె ని ఎంపిక చేసినట్లు టాక్. ఇటీవల ఈ విషయమై దీపికా తో మాట్లాడిన రాజమౌళి, ఆమె డేట్స్ కూడా తీసుకున్నారని, ఈ సినిమా వచ్చే ఏడాది మధ్యలో ప్రారంభం అవుతుందని అంటున్నారు. కాగా ఇటీవల ప్రభాస్ తదుపరి నటించనున్న నాగ అశ్విన్ సినిమాలో కూడా దీపికా హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే….!!