225 total views, 1 views today
ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇటీవల కొన్నాళ్లుగా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పలు డబ్ స్మాష్, టిక్ టాక్ వీడియోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తున్నాడు. ఇక ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ అలవైకుంఠపురములో సినిమాలోని బుట్ట బొమ్మ సాంగ్ కి తన భార్య తో కలిసి డాన్స్ అదరగొట్టిన వార్నర్,
Pokiri in the house🧣🧡#OrangeArmy #SRH | @davidwarner31 | @urstrulyMahesh pic.twitter.com/yWSTOQLFtN
— SunRisers Hyderabad (@SunRisers) May 10, 2020
నేడు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ మూవీ పోకిరి లోని ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’ అనే డైలాగ్ టిక్ టాక్ వీడియో చేసి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది. కాగా వార్నర్ నోటా పలికిన ఆ పండుగాడు డైలాగ్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది…..!!