160 total views, 1 views today
ప్రస్తుతం ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్ ని అంతమొందించడానికి అలానే ఆ వైరస్ మరింతగా ప్రబలకుండా ఉండడానికి ఇప్పటికే మన దేశం సహా పలు ఇతర దేశాలు కూడా కొన్నాళ్లపాటు పూర్తిగా లాకౌట్ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత ప్రధాని నరేంద్ర మోడీ మన దేశాన్ని ఏప్రిల్ 15 వరకు పూర్తిగా 21 రోజుల పాటు లొక్కౌట్ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే ఈ సమయంలో ప్రజలు ఎవరికి వారు పూర్తిగా తమ తమ ఇళ్లకు పరిమితం అవ్వాలని, ఎప్పటికప్పుడు తమ చేతులను శానిటైజెర్ తో శుభ్రం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా సామజిక దూరం పాటించాలని ప్రధాని కోరడం జరిగింది.
అయితే ఈ కరోనా మహమ్మారిని అలక్ష్యం చేయవద్దని, దీనిపట్ల ఎంతో జాగ్రత్త వహించి మెల్లగా తరిమికొట్టాలని టాలీవుడ్ నటుడు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి సంగీత దర్శకుడు కోటి సారధ్యంలో ఒక వీడియో సాంగ్ ని రూపొందించారు. ప్రజలు తీసుకోవలసిన జాగ్రతలు, అలానే సోషల్ డిస్టెన్స్ పాటించడం, ఐసోలేషన్ తదితర పలు విషయాలపై హీరోలు ప్రజలకు అవగాహనా కల్పిస్తూ స్ఫూర్తిని నింపుతూ సాగిన ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది…..!!