200 total views, 1 views today
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే కరోనా వలన రాష్ట్రం సమస్యల్లో ఉండడంతో, తన వంతుగా ఆంధ్ర తెలంగాణా రాష్ట్రాల ముఖ్యమంత్రుల రిలీఫ్ ఫండ్ కు మొత్తంగా రూ.1 కోటి విరాళంగా ప్రకటించి తన గొప్పమనసుని మరొక్కసారి చాటుకున్నారు. ఇకపోతే నేడు ఆయన ముద్దుల కూతురు సితార, ఐదు ముఖ్య సూత్రాలను పాటించి కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలని సూచనలను చేస్తోంది.
ముందుగా ఎవరికి వారు ఇళ్ళకే పరిమితం అయి సోషల్ డిస్టెన్స్ పాటించాలని, రోజులో ఎక్కువసార్లు కనీసం 20 సెకన్ల పాటు చేతలను సబ్బుతో కానీ శానిటైజర్ తో కానీ శుభ్రం చేసుకోవాలని, అలానే మన చుట్టుప్రక్కల వారితో కూడా ఎక్కువగా దూరం పాటిస్తూ ఉండాలని, దగ్గు లేదా తుమ్ము వచ్చినపుడు మన చేతిని మోచేతి వరకు గట్టిగా మొహం దగ్గర పెట్టిఉంచాలని, అలానే ఎవరికైనా దగ్గు, జలుబు, తీవ్ర జ్వరం వస్తే వెంటనే దగ్గరలోని డాక్టర్ ని సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచనలు చేసిన వీడియో ని కాసేపటి క్రితం మహేష్ తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసారు…..!!
Golden rules!! When kids speak…u listen…#StayHomeStaySafe 🙏🏻🙏🏻 pic.twitter.com/v8Ih3ps8D0
— Mahesh Babu (@urstrulyMahesh) March 27, 2020