566 total views, 1 views today
టాలీవుడ్ దిగ్గజ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన సినిమాలు, అలానే ఆ సినిమాల్లో ఆయన పలికే డైలాగులు మన తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఎప్పుడూ ఉన్నదీ ఉన్నట్లుగా మాట్లాడే అలవాటున్న మోహన్ బాబు తో ఎందరో సినిమా ప్రముఖులతో మంచి పరిచయాలు ఉన్నాయి.
My extended family, Sri. T. Subbarami Reddy’s daughter, our darling Pinky, threw a challenge to me to cook. Here is it is Pinky. https://t.co/5zNgNbv3ut via @YouTube
— Mohan Babu M (@themohanbabu) April 27, 2020
ఇకపోతే ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో మిగతా నటుల మాదిరిగానే ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటూ తన ఫ్యామిలీ తో కలిసి గడుపుతున్న మోహన్ బాబు, నిన్న టి సుబ్బిరామిరెడ్డి గారి కుమార్తె పింక్ రెడ్డి విసిన ఛాలెంజ్ ని స్వీకరించి తన మనవరాలి తో కలిసి వడలు వేశారు. దానికి కావలసిన పదార్ధాలన్నీ కలిపి స్వయంగా వడలు తాయారు చేసిన మోహన్ బాబు, ఈ విధంగా ఇంటి పనుల్లో తనకు తోచిన సాయాన్ని అందిస్తున్నానని, అలానే తన మనవరాళ్లతో కలిసి చక్కగా ఈ లాక్ డౌన్ కాలాన్ని గడుపుతున్నాని తన ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది….!!!