చిరు – కొరటాల మూవీలో హీరోయిన్ ఆమేనా…..??

 255 total views,  3 views today

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్స్ పై ఎంతో భారీ రేంజ్ లో నిర్మితం అవుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఒక కీలక రోల్ లో నటించబోతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక మరోవైపు ఈ సినిమాలో మెగాస్టార్ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనే దానిపై పలువురు హీరోయిన్ల పేర్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతున్నాయి. 

అయితే నేడు కొన్ని ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ సరసన త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు టాక్. ఆల్మోస్ట్ త్రిషని తీసుకోవాలని సినిమా యూనిట్ ఫిక్స్ అయిందని, మరి కొద్దిరోజుల్లో అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాని స్వతంత్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం కనపడుతోంది…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *