137 total views, 1 views today
హాలీవుడ్ నటుడు డానియల్ క్రెయిగ్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న జేమ్స్ బాండ్ సిరీస్ 25వ సినిమా ‘నో టైం టు డై’. గతంలో వచ్చిన పలు బాండ్ సినిమాల్లో హీరోగా నటించి ప్రేక్షకుల నుండి మంచి పేరు దక్కించుకున్న క్రెయిగ్, ఈ సినిమా కోసం ఎన్నో సహస కృత్యాలు చేసారు. సినిమాలోని కొన్ని కీలక సీన్స్ లో క్రెయిగ్ ఎటువంటి డూప్ అవసరం లేకుండా స్వయంగా చేసారని సమాచారం. ఇక ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ట్రైలర్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాండ్ సినిమా లవర్స్ ని ఎంతో ఆకట్టుకుంది.
అయితే ఈ సినిమాని వాస్తవానికి రాబోయే ఏప్రిల్ లో రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ ఎఫెక్ట్ ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న సందర్భంగా ఇటువంటి సమయంలో తమ సినిమాని రిలీజ్ చేయడం సరికాదని భావించి దానిని రాబోయే నవంబర్ కు పోస్ట్ పోన్ చేస్తూ దర్శక నిర్మాతలు నేడు ఒక ప్రకటన రిలీజ్ చేసారు. రామి మాలెక్, లియా సెడోక్స్, లాషనా లించ్, బెన్ విషా తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాని మెట్రో గోల్డ్ విన్ మేయర్ ఇయాన్ ప్రొడక్షన్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ ఖర్చుతో నిర్మిస్తుండగా, క్యారీ జోజి ఫ్యుకునాగా దర్శకత్వం వహిస్తున్నారు…..!!