171 total views, 1 views today
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, అందాల భామ పూజ హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అలవైకుంఠపురములో ఇటీవల పొంగల్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. సీనియర్ యాక్ట్రెస్ టబు ఒక కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో జయరాం, మురళీశర్మ, సునీల్, వెన్నెలకిషోర్, రాజేంద్ర ప్రసాద్, సుశాంత్, నివేత పేతురాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
ఇకపోతే ఈ సినిమాలో సాంగ్స్ అన్ని కూడా సినిమా రిలీజ్ కు ముందే సూపర్ గా హిట్ అయిన విషయం తెలిసిందే. ఇక థియేటర్ లో విజువల్ గా ఆంధ్రోట్టిన ఈ సాంగ్స్ లో మూడు సాంగ్స్ బాగా పాపులర్ కాగా, అందులో బుట్టబొమ్మ సాంగ్ కూడా ఒకటి అనే చెప్పాలి. బన్నీ, పూజల పై ఎంతో స్టైలిష్ గా చిత్రీకరించబడ్డ ఈ సాంగ్ ఫుల్ వీడియో ని కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. ఇక ప్రస్తుతం ఈ సాంగ్ ని అదరగొట్టే వ్యూస్ తో దూసుకుపోతోంది. మరి మీరు కూడా ఈ సాంగ్ పై ఒక లుక్ వేయండి..!!