172 total views, 5 views today
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన లేటెస్ట్ హిట్ మూవీ అలవైకుంఠపురములో. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాతో పాటు ఇందులోని సాంగ్స్ కూడా ఎంత పెద్ద విజయాన్ని అందుకున్నాయి అందరికీ తెలిసిందే. ఇక మరీ ముఖ్యంగా సామజవరగమనా, రాములో రాములా, బుట్ట బొమ్మ సాంగ్స్ అయితే శ్రోతలను, ముఖ్యంగా యువతను విశేషంగా అలరించాయి అనే చెప్పాలి.
ఇప్పటికే యూట్యూబ్ లో సామజవరగమనా, రాములో రాములా సాంగ్స్ 100 మిలియన్ల వ్యూస్ అందుకోగా, నిన్నటితో బుట్ట బొమ్మ సాంగ్ కూడా ఆ ఫీట్ ని అందుకోవడంతో పాటు 1 మిలియన్ లైక్స్ సాధించింది. ఈ విధంగా అలవైకుంఠపురములో మూడు సాంగ్స్ కూడా ఇంతటి సెన్సేషనల్ రికార్డు అందుకోవడంతో బన్నీ ఫ్యాన్స్ అమితానందాన్ని వ్యక్తం చేస్తున్నారు….!!