బన్నీ, సుకుమార్ మూవీ పై సంచలన విషయాలు చెప్పిన నటుడు రాజ్ దీపక్….!!

 278 total views,  1 views today

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వెరైటీ సినిమాల దర్శకుడు సుకుమార్ ల క్రేజీ కాంబోలో ఒక సినిమా తెరెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని, రత్నవేలు ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఇటీవల త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన మంచి హిట్ కొట్టిన బన్నీ, ఎలాగైనా ఈ సినిమాతో కూడా మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. 

గంధపు చెక్కల నేపథ్యంలో మాస్, యాక్షన్ డ్రామాగా పలు కమర్షియల్ హంగులతో ఈ సినిమా తెరకెక్కుతోందని, అలానే హీరో హీరోయిన్లు ఇద్దరూ కూడా పక్కా మాస్ రోల్స్ లో నటిస్తున్నారని టాలీవుడ్ వర్గాల టాక్. ఇకపోతే నేడు ఈ సినిమాకు సంబందించిన కొన్ని కీలక విషయాలను నటుడు రాజ్ దీపక్ శెట్టి ఒక ఇంటర్వూలో భాగంగా మీడియాతో పంచుకున్నారు. 

ఈ సినిమాలో తనతో పాటు విజయ్ సేతుపతి, జగపతి బాబు కూడా విలన్స్ గా నటిస్తున్నారని, తమ ముగ్గురు పాత్రలు ఎంతో పవర్ఫుల్ గా దర్శకుడు సుకుమార్ డిజైన్ చేసారని ఆయన అన్నారు. ఇక సినిమాలో బన్నీ, రష్మిక క్యారెక్టర్స్ కూడా ఎంతో బాగా తెరకెక్కుతున్నాయని, తప్పకుండా మంచి కమర్షియల్ హంగులతో తెరకెక్కుతున్న ఈ సినిమా విజయాన్ని అందుకోవడం ఖాయం అని రాజ్ దీపక్ అన్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని దీపావళి కానుకగా థియేటర్స్ లోకి తీసుకువచ్చే అవకాశం కనపడుతోంది….!! http://www.xvideos.com/video35935849/latest_recording_dance_2018

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *