బాలయ్యతో సినిమా ఎలా ఉంటుందో చెప్పిన బోయపాటి…..!!

 146 total views,  1 views today

నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సింహా సినిమా నేటితో రిలీజ్ అయి సక్సెస్ఫుల్ గా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నందమూరి ఫ్యాన్స్ అందరూ కూడా దానిని పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో మంచి పండుగలా జరుపుకుంటున్నారు. కాగా నేడు కాసేపటి క్రితం ఈ సినిమా దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ వీడియో ఇంటర్వ్యూ నిర్వహించింది.

balakrishna boyapati

అందులో భాగంగా బోయపాటి మాట్లాడుతూ, తనకు ఫస్ట్ టైం బాలకృష్ణ గారితో దర్శకుడిగా అవకాశం వచ్చినపుడే ఆయనను ఒక పవర్ఫుల్ రోల్ లో చూపించాలనే ఆలోచన వచ్చిందని, ఆ ఆలోచనలో నుండి పుట్టిన సినిమాలే సింహా, లెజెండ్ అని అన్నారు. ఇక ప్రస్తుతం బాలయ్య గారితో తీస్తున్న మూడవ సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాదిస్తుందని చెప్పిన బోయపాటి, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఆ సినిమా కథ తాయారు చేసినట్లు చెప్పారు. అలానే సింహా, లెజెండ్ మాదిరిగా ఈ సినిమాలో కూడా బాలయ్య గారి పాత్ర అదిరిపోతుందని అన్నారు……!!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *