138 total views, 1 views today
భారత క్రికెట్ జట్టు రథసారథి విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ బాలీవుడ్ లో పలు సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించి హీరోయిన్ గా ఎంతో గొప్ప పేరు దక్కిచుకున్న విషయం తెలిసిందే. అయితే విరాట్ తో వివాహం అనంతరం ఎంతో ఆచితూచి సినిమాలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న అనుష్క, అతి త్వరలో మన టాలీవుడ్ సినిమా పరిశ్రమకు కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తాజా సమాచారం. అయితే ఆమె ఇక్కడికి ఎంట్రీ ఇవ్వనున్నది హీరోయిన్ గా కాదని, నిర్మాతగా అని అంటున్నారు.
ఇక్కడి కొందరు సక్సెస్ఫుల్ హీరోలతో తమ స్వంత నిర్మాణ సంస్థపై సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్న అనుష్క, ఇటీవల మన టాలీవుడ్ కి చెందిన ఇద్దరు బడా హీరోలతో పాటు మరొక మిడిల్ రేంజ్ మార్కెట్ కలిగిన హీరోలతో సంప్రదింపులు జరిపారని సమాచారం. అన్ని కలిసి వస్తే ఈ ఏడాది చివర్లో అనుష్క తన సంస్థపై ఇక్కడ సినిమాలు ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు. మరి ప్రస్తుతం అవుతున్న ఈ వార్తపై ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజుల్లో వెయిట్ చేయాల్సిందే…..!!