34 total views, 1 views today
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అతి త్వరలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా సలార్. కన్నడ ప్రఖ్యాత సంస్థ హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై ఎంతో భారీ ఖర్చుతో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కనున్న ఈ సినిమా కి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతోంది. ఒక ప్రముఖ హీరోయిన్ ప్రభాస్ కు జోడీగా నటించనున్న ఈ సినిమాని పక్కాగా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్నట్లు టాక్. ప్రభాస్ ఇందులో ఒక మాఫియా డాన్ గా ఎంతో వైలెంట్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్.
ఇకపోతే అసలు మ్యాటర్ ఏమిటంటే, ఈ సినిమాలో హీరో పాత్రకు ధీటుగా విలన్ పాత్ర కూడా బాగా పవర్ఫుల్ గా ఉటుందని, కాగా ఆ క్యారెక్టర్ కోసం ఇటీవల ప్రముఖ బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం ని ఎంపిక చేసిందట మూవీ యూనిట్. అతడు అయితేనే ఆ పాత్రకు పర్ఫెక్ట్ అని భావించారట దర్శకడు ప్రశాంత్ నీల్ కూడా. అయితే ప్రస్తుతం ఈ న్యూస్ పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్నప్పటికీ దీనిపై సలార్ టీమ్ నుండి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉందని అంటున్నారు విశ్లేషకులు…..!!