ప్రముఖ నటుడు రిషి కపూర్ మృతి…..!!

 155 total views,  1 views today

నిన్న బాలీవుడ్ ప్రముఖ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందిన వార్తను మరువకముందే నేడు మరొక బాలీవుడ్ దిగ్గజ నటుడైన రిషి కపూర్ అకాల మరణం పొందారు. కొన్నాళ్లుగా శ్వాస కోశ సంబంధ క్యాన్సర్ తో ఎంతో ఇబ్బంది పడుతున్న రిషి కపూర్, ఇటీవల దానికి చికిత్స తీసుకుని కొంత కోలుకోవడం జరిగింది. కాగా నేడు ఆయనకు ఒక్కసారిగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురుకావడంతో వెంటనే ఆయనను ముంబైలోని సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు.

Rishi Kapoor Passes Away: Aamir Khan to Priyanka Chopra ...

ఆ తరువాత డాక్టర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ రిషి కపూర్ ఆరోగ్యం సహకరించక మరణించారని ఆయన సోదరుడు రణధీర్ కపూర్ కాసేపటి క్రితం మీడియా కు ఒక ప్రకటన రిలీజ్ చేసారు. రిషి కపూర్ మరణంతో బాలీవుడ్ సినిమా పరిశ్రమ మొత్తం శోకసంద్రం లో మునిగిపోయింది. కాగా పలువురు నటులు, రాజకీయ ప్రముఖులు రిషి కపూర్ ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పిస్తున్నారు……!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *