అల్లు అర్జున్ ‘పుష్ప’ లో ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ….??

 169 total views,  1 views today

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వెరైటీ సినిమాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితం అవుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుండగా, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక మొన్న బన్నీ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు ఫ్యాన్స్ నుండి విశేషమైన స్పందిన లభించింది. ఇకపోతే ఈ సినిమాలో కూడా గతంలో సుకుమార్ సినిమాల వలె ఒక అదిరిపోయే ఐటెం సాంగ్ ఉందని సమాచారం.

Pushpa title gets mixed reactions | telugucinema.com

ఇప్పటికే ఈ సాంగ్ కోసం దేవి అదరగొట్టే ట్యూన్ కూడా ఇవ్వడం జరిగిందని, అతి త్వరలో ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఈ సాంగ్ లో నటించనుందని అంటున్నారు. అతి త్వరలో ఆమెను కలిసి సాంగ్ గురించి వివరించనున్నారట దర్శక, నిర్మాతలు. పాన్ ఇండియా ఫీల్ తో పలు భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న సినిమా కావడంతో ఆ హీరోయిన్ కూడా ఒప్పుకుంటుందని అంటున్నారు. మరి ఇదే కనుక నిజం అయితే, బన్నీ ఫ్యాన్స్ కి ఇది మంచి జోష్ నిచ్చే న్యూస్ అని చెప్పకతప్పదు….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *