బాలీవుడ్ నటుడు ‘ఇర్ఫాన్ ఖాన్’ హఠాన్మరణం…..!!

 164 total views,  1 views today

బాలీవుడ్ తో పాటు పలు హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించి నటుడిగా ఎంతో గొప్ప పేరు గడించిన ఇఫర్ఫాన్ ఖాన్ (54) నేడు ముంబై లోని కోకిల బెన్ ధీరుభాయి అంబానీ ఆసుపత్రిలో మృతి చెందారు. కొన్నాళ్లుగా పెద్ద ప్రేగు క్యాన్సర్ తో తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఇర్ఫాన్, గత ఏడాది లండన్ లో దానికి ప్రత్యేక చికిత్స తీసుకుని ఇటీవల ఇండియా కి వచ్చారు.

Irrfan Khan admitted to Hospital, Passes away at Kokilaben ...

కాగా నాలుగు రోజుల క్రితం తన తల్లి మరణముతో ఎంతో కృంగిపోయిన ఇర్ఫాన్ కు, క్యాన్సర్ మరింతగా తిరగబెట్టడంతో నిన్నటి నుండి కోకిల బెన్ ఆసుపత్రి ఐసియు లో ఆయనకు చికిత్సనందించసాగారు డాక్టర్లు. అయితే కాసేపటి క్రితం ఆయన ఆరోగ్యం మరింత విషమించి ఒక్కసారిగా మరణించారని డాక్టర్లు ధ్రువీకరించడం జరిగింది. ఇర్ఫాన్ మరణముతో బాలీవుడ్ సినిమా పరిశ్రమ మొత్తం కూడా శోకసంద్రం లో మునిగిపోయింది. కాగా పలువురు ప్రముఖులు ఆయన మృతిపై సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు……!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *