142 total views, 1 views today
నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవల కరోనా బాధితులకు మొత్తం రూ.1.25 లక్షల విరాళం ప్రకటించిన విషయంట్ తెలిసిందే. అందులో రూ.50 లక్షల చొప్పున రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు అలానే మరొక రూ.25 లక్షలు కరోనా విపత్తు నిధికి బాలయ్య ఇచ్చారు. అయితే దానిలో భాగంగా నేడు రూ.50 లక్షల చెక్కును తన అల్లుడు భరత్ తో కలిసి వెళ్లి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అందచేశారు.
కాగా భారత్ కూడా మొత్తం రూ.1 కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. అందులో రూ.25 లక్షలు చెక్ కేటీఆర్ కు అందించిన భరత్, మిగతా రూ.75 లక్షల్లో, రూ.50 లక్షలు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు అలానే మిగతా రూ. 25 లక్షలు కర్ణాటక సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇవ్వనునంట్లు తెలిపారు. ఇంత గొప్పమనసుతో బాలకృష్ణతో పాటు ఆయన అల్లుడు భరత్ చేసిన సాయం పై పలువురు ప్రజలు వారిపై పొగడ్తలు కురిపిస్తున్నారు….!!