బాలయ్య – బోయపాటి షూటింగ్ లేటెస్ట్ అప్ డేట్….!!

 85 total views,  1 views today

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో గతంలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు ఎంతటి గొప్ప విజయాలు అందుకున్నాయి తెలిసిందే. ఇక ప్రస్తుతం వారిద్దరి కలయికలో మరొక సినిమా రానుంది. యువ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నేడు ప్రారంభం అయింది.

కాగా ఆ విషయాన్ని బోయపాటి తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభిమానులకు తెలియచేసారు. ఒక మంచి పవర్ఫుల్ స్టోరీ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సినిమాలో బాలయ్య రోల్ సూపెర్బ్ గా డిజైన్ చేశారట బోయపాటి. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి, దీనిని దీపావళి కానుకగా రిలీజ్ చేసే అవకాశం కనపడుతోంది. మరి సింహా, లెజెండ్ ల మాదిరిగా ఈ సినిమా కూడా ఎంత మేర సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించనున్న ఈ సినిమాలో బాలయ్య సరసన ఒక స్టార్ హీరోయిన్ నటిస్తున్నట్లు టాక్….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *