155 total views, 2 views today
టాలీవుడ్ దర్శకదిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో ఆర్కా మీడియా బ్యానర్ పై తెరకెక్కిన చిత్రరారాజం బాహుబలి కి సీక్వెల్ గా తెరకెక్కిన బాహుబలి 2 సినిమా, సరిగ్గా మూడేళ్ళ క్రితం ఇదే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చి అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా క్రియేట్ చేసిన అత్యద్భుతమైన రికార్డ్స్ ఇప్పటికీ కూడా అంత పదిలంగా ఉన్నాయి అంటే,
బాహుబలి 2 సినిమా స్టామినా ఎటువంటిదో అర్ధం చేసుకోవచ్చు. రెబల్ స్టార్ ప్రభాస్ అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా ఎంతో గొప్పగా నటించి ప్రేక్షకుల మనసు దోచారు. ప్రేక్షకుడిని కట్టిపడేసిన రాజమౌళి మార్క్ టేకింగ్, కథ, కథనాలు, అత్యద్భుతమైన విజువల్స్, హీరోయిన్ అనుష్క వండర్ఫుల్ పెర్ఫార్మన్స్, సంగీతం,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి ఈ సినిమాని ఇంతగొప్ప అందుకోవడానికి కారణం అయ్యాయి. ఇక నేటితో ఈ సినిమా మూడేళ్లు పూర్తి చేసుకోవడంతో పలువురు అభిమానులు సినిమా యూనిట్ కి అభినందనలు తెలపడంతో పాటు పలు ట్రెండ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియా మాధ్యమాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు….!!