అనుష్క అతడినే పెళ్లి చేసుకుంటుందట….!!

 154 total views,  1 views today

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన అనుష్క శెట్టి ప్రస్తుతం హేమంత్ మధుకర్ దర్శకత్వంలో నిశ్శబ్దం అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆమె సాక్షి అనే మూగ ఆర్టిస్ట్ పాత్రలో నటిస్తుండగా సీనియర్ నటుడు మాధవన్, హీరోయిన్ అంజలి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇటీవల రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి మంచి స్పందన రాబట్టింది. ఇక నిన్నటి హిట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన అనుష్క, తన ప్రసంగం తో ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించారు. 

ఇకపోతే అనుష్క పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనే దానిపై ఎప్పటినుండో పలు వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. అయితే నిన్న ఒక ప్రముఖ మీడియా ఛానల్ తో మాట్లాడిన అనుష్క, తన పెళ్లిపై ప్రస్తుతం ప్రచారం అవుతున్నావని కూడా పుకార్లని, తాను ఎవరినీ ప్రేమించలేదని, అలానే తన తల్లితండ్రులు చూపించిన అబ్బాయితోనే తన పెళ్లి జరుగుతుందని చెప్పిన అనుష్క, అతడ్నే పెళ్లి చేసుకుంటానని అన్నారు. దీనితో ఆమె పెళ్లి గురించి ప్రస్తుతం ప్రచారం అవుతున్న పుకార్లకు పూర్తిగా అడ్డుకట్ట పడినట్లు తెలుస్తోంది…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *