మరోసారి ప్రభాస్ మూవీ లో నటించనున్న అనుష్క….??

 167 total views,  1 views today

ప్రస్తుతం యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో జాన్ సినిమాలో నటిస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్, దాని అనంతరం మహానటి మూవీ ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్విని దత్ ఎంతో భారీ ఖర్చుతో నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది డిసెంబర్ లో ప్రారంభం అవుతుందని ఇటీవల దర్శకుడు అశ్విన్ తెల్పడం జరిగింది.

Anushka Shetty opens up on relationship rumours with Prabhas ...

అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కూడ ఎంతో కీలకం అయినదని, కావున ఆ పాత్ర కోసం స్వీటీ అనుష్క ని తీసుకోవాలని చూస్తున్నాడట దర్శకుడు అశ్విన్. ఈ విషయమై అతి త్వరలో అనుష్కను కలిసి కథను కూడా వినిపించనున్నట్లు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై పూర్తి అధికారిక వివరాలు వెల్లడి కావలసి ఉంది….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *