మూవీ రివ్యూ – “నిశ్శబ్దం” : వామ్మో, ఇలా ఉంటుందని అసలు ఊహించలేదుగా ….!!

 422 total views,  1 views today

బెంగళూరు భామ అనుష్క శెట్టి పూరి డైరెక్షన్ లో నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆపై అరుంధతి సినిమాతో స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. ఇక ఇటీవల రాజమౌళి తీసిన బాహుబలి రెండు భాగాల సినిమాల్లో దేవసేన పాత్రలో అదరగొట్టిన అనుష్క లేటెస్ట్ గా నటించిన సినిమా  నిశ్శబ్దం. యువ దర్శకడు హేమంత్ మధుకర్ తీసిన ఈ సస్పెన్స్, థ్రిల్లర్ మూవీని కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్స్ మీడియా ఫాక్టరీ సంస్థల పై కోన వెంకట్, టిజి విశ్వప్రసాద్ కలిసి నిర్మించగా గోపిసుందర్ మ్యూజిక్ అందించాడు. మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్, మైకేల్ మ్యాడ్సెన్ తదితరులు ఈ సినిమాలో ఇతర పాత్రల్లో నటించారు. మరి నేడు ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం …..!!

Nishabdham Movie Review: All gloss and no depth

కథ :

ఇక కథ గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుండి అనాధాశ్రమంలో కలిసి పేరైన ఇద్దరు ఆనాధలు సాక్షి (అనుష్క శెట్టి), సోనాలి (షాలిని పాండే) ఇద్దరికీ ఒకరిపై మరొకరికి అమితమైన ఇష్టం ఉంటుంది. ఆ తరువాత ఇద్దరూ యుక్త వయసుకుని వచ్చిన అనంతరం సాక్షి ఆంటోని (మాధవన్) ని ప్రేమిస్తుంది. అయితే ఆ తరువాత అనుకోకుండా సోనాలి మిస్ అవడం, అలానే ఆంటోనీ దారుణంగా హత్యకు గురికావడంతో సినిమా కొంత ఆసక్తికరంగా మారుతుంది. ఇక అక్కడి నుండి ఆ మర్డర్ ఎవరు చేసారు, అసలు సోనాలి ఎలా మిస్ అయింది అనేది కనుక్కోవడానికి క్రైమ్ డిటెక్టీవ్ ఆఫీసర్ మహా (అంజలి) ని ప్రత్యేకంగా నియమిస్తారు. మరి ఆమె ఆంటోని హత్యని, అలానే షాలిని మిస్సింగ్ కేసు ని చేదించిందా, అది ఎలా జరిగింది, ఆ ఘటనలకు కారకులు ఎవరు అనేది తెరపై చూడాల్సిందే …!!

Nishabdham Movie Review | Nishabdham Telugu Tamil Review

విశ్లేషణ :

నటిగా తన అద్భుత నటనతో గత సినిమాల ద్వారా మంచి పేరు దక్కించుకున్న అనుష్క శెట్టి ఈ సినిమాలో సాక్షి అనే మూగ ఆర్టిస్ట్ గా అద్భుతంగా నటించింది అనే చెప్పాలి. అలానే మాధవన్, అంజలి, షాలిని పాండే, తదితరులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించి ఆకట్టుకున్నారు. దర్శకుడు హేమంత్ మధుకర్ ఎంచుకున్న పాయింట్ మంచిదే అయినప్పటికీ స్క్రీన్ ప్లే విషయంలో అక్కడక్కడా కొన్ని దోషాలు తలెత్తాయి. అయితే మంచి సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరచదనే చెప్పాలి. నిర్మాణ విలువలు, ఫోటోగ్రఫి, సంగీతం, నేపధ్య సంగీతం, అక్కడక్కడా కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ ….!

ప్లస్ పాయింట్స్ :

అనుష్క నటన
కొన్ని థ్రిల్లింగ్ సీన్స్
నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్ :

ప్రెడిక్టబుల్ సీన్స్
మధ్యలో బోరింగ్ గా సాగె కథనం

చివరిగా :

మంచి అంచనాలతో థ్రిల్లింగ్ జానర్ లో తెరకెక్కిన ఈ నిశ్శబ్దం సినిమా అద్భుతంగా ఉంది అని చెప్పలేకపోయినా ఇటువంటి సినిమాలు ఇష్టపడే వారికి బాగానే నచుతుంది అని చెప్పవచ్చు. అయితే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చూసేవారికి మాత్రం ఇది ఆశించిన రేంజ్ సంతృప్తిని అయితే ఇవ్వలేదు. మొత్తంగా ఈ నిశ్శబ్దం సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది అని చెప్పచ్చు …!!

రేటింగ్ : 3 / 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *