పవన్ – క్రిష్ మూవీ లో హీరోయిన్ గా జేజమ్మ….??

 271 total views,  1 views today

ప్రస్తుతం దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్న వకీల్ సాబ్ సినిమాలో ఒక పవర్ఫుల్ లాయర్ గా నటిస్తున్న పవన్, ఇటీవల మరోవైపు క్రిష్ దర్శకత్వంలో కూడా ఒక పీరియాడికల్ మూవీ షూటింగ్ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమాలో జేజమ్మ అనుష్క హీరోయిన్ గా గా ఎంపికైనట్లు నేడు కొన్ని ఫిలిం నగర్ వర్గాల నుండి తాజాగా సమాచారం అందుతోంది.

I would love to work with Pawan Kalyan says Anushka Shetty

ఇటీవల కొన్నాళ్ల క్రితం నిశ్శబ్దం సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న అనుష్క, ప్రస్తుతం లాక్ డౌన్ తరువాత నుండి ఖాలీగానే ఉండడంతో పాటు మరొక సినిమా ఏది అంగీకరించలేదని, అయితే తన సినిమాలోని హీరోయిన్ పాత్రకు అనుష్క అయితేనే బాగుంటుందని భావించిన దర్శకుడు క్రిష్ రెండు రోజుల క్రితం అనుష్కకు కాల్ చేసి పవన్ తో చేస్తున్న సినిమా కథ, కథనాలు వినిపించడం, అవి ఎంతో నచ్చిన అనుష్క, ఆ సినిమాలో హీరోయిన్ గా నటిస్తాను అని చెప్పడం జరిగిందట. కాగా మరొక వారం రోజుల్లో ఈ విషయమై అఫీషియల్ అనౌన్సుమెంట్ కూడా రానుందని అంటున్నారు….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *