‘నిశ్శబ్దం’ ట్రైలర్ తో నిశ్శబ్దంగా అదరగొట్టిన అనుష్క…..!!

 110 total views,  1 views today

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు కలిసి సంయుక్తంగా ఎంతో భారీగా నిర్మిస్తున్న తాజా సినిమా నిశ్శబ్దం. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా సస్పెన్స్, థ్రిల్లింగ్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి స్పందనను రాబట్టింది. ఇకపోతే నేడు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని, రిలీజ్ చేసారు. ట్రైలర్ లో ఆద్యంతం పలు సస్పెన్స్ తో పాటు యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలు వంటివి జోడించారు.

ముఖ్యంగా సాక్షి అనే మ్యూట్ ఆర్టిస్ట్ పాత్రలో అనుష్క నటన అదరగొట్టినట్లు ట్రైలర్ ని బట్టి చూస్తే మనకు అర్ధం అవుతుంది. ఇక ఒక హాలీవుడ్ మూవీ మార్క్ రేంజ్ విజువల్స్ ఈ సినిమాకు మంచి ఆకర్షణ కానున్నట్లు తెలుస్తోంది. మాధవన్, అంజలి, సుబ్బరాజు, షాలిని పాండే తో పాటు హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడ్సన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక కాసేపటి క్రితం రిలీజ్ అయిన ఈ ట్రైలర్ లో యూట్యూబ్ లో దూసుకుపోవడంతో పాటు సినిమాపై భారీగా ప్రేక్షకుల్లో అంచనాలు క్రియేట్ చేసింది. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాని ఏప్రిల్ 2న రిలీజ్ చేయనున్నారు….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *