161 total views, 1 views today
ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస హిట్ల తో దూసుకుపోతున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి, ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ ని తన కథలో వేసుకున్నాడు. అయితే తన తదుపరి చిత్రం ఎఫ్2 సీక్వెల్ ఎఫ్ 3ని అతి త్వరలో తెరకెక్కించబోతున్న టాలీవుడ్ లో గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
తొలిసారిగా కళ్యాణ్ రామ్ తో పటాస్ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ పట్టేసి మంచి హిట్ కొట్టిన అనిల్, ఆ కృతజ్ఞతతో నందమూరి ఫామిలీ కి మరో సినిమా చేయాలన్న ఉద్దేశ్యంతో ఇటీవల బాలయ్య బాబు కి ఒక మంచి కథ చెప్పినట్టు సమాచారం. అలానే తనకి బాలయ్య అంటే ఎంతో ఇష్టమని పలు సందర్భాల్లో అనిల్ చెప్పడం జరిగింది. అయితే అనిల్ చెప్పిన కథ ప్రకారం, ఆ సినిమాలో బాలయ్యతో పాటు ఆయన తనయుడు మోక్షజ్ఞ కూడా ఆ సినిమాలో నటించే ఛాన్స్ ఉందని సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం నందమూరి ఫ్యాన్స్ కి ఇది మంచి పండుగ వార్తే అని చెప్పకతప్పదు….!!