544 total views, 1 views today
ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందాన్నలా కలయికలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకుని వరుసగా సక్సెస్ లతో దూసుకుపోతున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ అయిన ఎఫ్ 3 సినిమా కథను సిద్ధం చేసే పనిలో నిమగ్నం అయి ఉన్నారు.
నిన్న ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో అనిల్ మాట్లాడుతూ, ఎఫ్ 3 తరువాత బాలకృష్ణ గారితో పని చేసే అవకాశం ఉందని అన్నారు. వాస్తవానికి బాలకృష్ణ గారి కోసం తన వద్ద ఎప్పుడో మంచి కథ ఒకటి సిద్ధం అయి ఉందని చెప్పిన అనిల్, ఆయన నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్లు చెప్పారు. మరి అది ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి……!!!