190 total views, 1 views today
ప్రస్తుతం తెలుగు టెలివిజన్ తెరపై తనదైన ఆకట్టుకునే అందం, యాంకరింగ్ టాలెంట్ తో మంచి పేరుతో దూసుకెళ్తున్న వారిలో రష్మీ గౌతమ్ కూడా ఒకరు. కొన్నేళ్ల క్రితం నుండి ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా మంచి పేరు, గుర్తింపు సంపాదించిన రష్మీ, మరోవైపు పలు సినిమాల్లో అక్కడకక్కడ కొన్ని పాత్రల్లో నటించి మంచి పేరు గడించడం జరిగింది.
ఇక ఇటీవల గుంటూరు టాకీస్ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన రష్మీ, నేడు తన 32వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో దేశం మొత్తం కూడా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఆమె తన ఈ పుట్టినరోజుని కుటుంబ సభ్యుల మధ్య జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా అనేకమంది ప్రేక్షకులు, అభిమానులు పలు సోషల్ మీడియా మధ్యమాల ద్వారా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు…..!!