ఒక్క సాంగ్ తో దుమ్ము దులిపిన యాంకర్ ప్రదీప్….. మ్యాటర్ ఏంటంటే….??

 106 total views,  1 views today

యాంకర్ గా బుల్లి తెరపై మంచి పేరుతో దూసుకెళ్తున్న యువ యాంకర్ ప్రదీప్ మాచిరాజు, కెరీర్ తొలి నాళ్లలో పలు టివి ఛానల్స్ లో ప్రసారం అయిన షో లకు వ్యాఖ్యాతగా వ్యవహరించి మంచి పేరు దక్కించుకున్నాడు. ఇక ఆ తరువాత ప్రదీప్ పెళ్లి చూపులు, కొంచెం టచ్ లో ఉంటె చెప్తాను వంటి షోలు యువతతో పాటు లేడీస్ లో కూడా ప్రదీప్ కు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి అనే చెప్పాలి. ఇక ఇటీవల సినిమాల్లో బాగా బిజీ అయిన ప్రదీప్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న సినిమా, ’30రోజుల్లో ప్రేమించడమెలా’.

అమృత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుండి ఇటీవల రిలీజ్ అయిన ‘నీలి నీలి ఆకాశం’  సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తో దూసుకెళ్తోంది. యువ గాయకుడూ సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ సాంగ్ ని మొదట సూపర్ స్టార్ మహేష్ రిలీజ్ చేయగా, అది 10 లక్షల వ్యూస్ ని అందుకుంది. ఇక కొద్దిరోజుల క్రితం అదే సాంగ్ ఫుల్ వీడియో ని రిలీజ్ చేయగా అది ప్రస్తుతం 40 లక్షల వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇక దీనిపై ప్రదీప్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ఈ సాంగ్ ని ఆదరిస్తున్న శ్రోతలకు, అలానే ప్రత్యేకంగా సూపర్ స్టార్ మహేష్ కు ధన్యవాదాలు చెప్తూ ఒక ట్వీట్ చేసాడు…..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *