టాలీవుడ్ మెగాస్టార్ పై ప్రశంసలు కురిపించిన బాలీవుడ్ మెగాస్టార్…..!!

 163 total views,  1 views today

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఎదిగినా కూడా ఒదిగి ఉండే నటుడు అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక తనకు తెలిసినవారికి ఏదైనా సమస్య వస్తే అందరికంటే ముందుగా స్పందించి వారికి ఎంతోకొంత ఆర్ధిక సాయం అందించే మంచి మనస్సుగల మెగాస్టార్, ప్రజలకు ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా టాలీవుడ్ నుండి ముందుగా స్పందిస్తూ తనవంతుగా ఎంతో కొంత సాయం అందిస్తూ ఉంటారు. ఇక ఇటీవల కరోనా మహమ్మారి వలన మన దేశం అంతా కూడా కొద్దిరోజులుగా లాక్ డౌన్ చేయబడడంతో మిగతా వారి మాదిరిగానే ఎందరో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి చెందిన రోజువారీ కార్మికులు పనులు లేక, తిండి లేక అవస్థలు పడుతుండడంతో వారి కోసం కరోనా విపత్తు నిధి పేరిట ఒక సంస్థను స్థాపించి ఇప్పటివరకు పలువురు ప్రముఖుల నుండి మొత్తంగా రూ.8 కోట్ల విరాళాలు సేకరించడం జరిగింది.

Chiranjeevi at Sye Raa Narasimha Reddy teaser launch: There's only ...

కాగా చిరు చేస్తున్న ఇంత గొప్ప పనిపై నేడు బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రశంసలు కురిపించారు. తెలుగు సినిమా కార్మికుల కోసం చిరంజీవి గారు చేస్తున్న ఈ బృహత్ కార్యం నిజంగా ఎంతో గొప్పది, ఆ భగవంతుడి ఆశీస్సులు ఆయనకు ఇప్పటికే ఉంటాయని, అలానే తనవంతుగా ఒక్కొక్కటి రూ.1500 విలువ చేసే 12000 కరోనా రిలీఫ్ కూపన్లను అందించడం జరిగింది. దానితో చిరంజీవి కూడా అమితాబ్ గొప్పతనాన్ని మెచ్చుకున్నారు. ఈ విధంగా మెగాస్టార్లు ఇద్దరూ కూడా తమ గొప్ప మనసుతో సినిమా కార్మికులకు మంచి చేస్తూ ప్రజలతో శభాష్ అనిపించుకుంటున్నారు….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *