178 total views, 2 views today
ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ సంస్థ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
ఇకపోతే ఈ సినిమా నుండి అల్లు అర్జున్ లుక్ ఒకటి లీక్ అయినట్లుగా నిన్నటి నుండి ఒక పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఎట్టకేలకు ఆ పోస్టర్ పై స్పందించిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు, అది కేవలం ఫ్యాన్ మేడ్ పోస్టర్ మాత్రమే అని, అతి త్వరలో ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేస్తాం అని ఒక ట్వీట్ చేయడం జరిగింది. కాగా వైరల్ అవుతున్న ఆ పోస్టర్ లో అల్లు అర్జున్ గుబురు గడ్డంతో ఊర మాస్ లుక్ లో అదరగొట్టాడు….!!