సెన్సేషనల్ రికార్డు నమోదు చేసిన అల్లు అర్జున్ ”పుష్ప” ఫస్ట్ లుక్ పోస్టర్….!!

 103 total views,  2 views today

ఏప్రిల్ 8న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన ఆయన తాజా సినిమా పుష్ప ఫస్ట్ లుక్ పోస్టర్ కు ఆయన ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల నుండి కూడా విపరీతమైన రెస్పాన్స్ లభించింది. అలవైకుంఠపురములో సినిమాలో ఎంతో స్టైలిష్ గా కనిపించిన అల్లు అర్జున్, ఈ సినిమాలో పక్కాగా మాస్ లో నటిస్తున్నట్లు ఆ పోస్టర్ ని బట్టి చూస్తుంటే తెలుస్తోంది.

 


ఇక ఈ పోస్టర్ మొత్తంగా అల్లు అర్జున్ ట్విట్టర్ అకౌంట్ లో 88.5 కె లైక్స్ అందుకుని, టాలీవుడ్ లో ఇప్పటివరకు విడుదలైన సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో అత్యధిక ట్విట్టర్ లైక్స్ అందుకున్న పోస్టర్ గా ఒక సెన్సేషనల్ రికార్డు నమోదు చేసింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *