అల్లు అర్జున్ ‘పుష్ప’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్….!!

 132 total views,  1 views today

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కి పుష్ప అనే టైటిల్ ని ఖరారు చేస్తూ సినిమా నిర్మాతలు, నేడు అల్లు అర్జున్  పుట్టినరోజు కావడంతో కాసేపటి క్రితం సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేయడం జరిగింది.

 

అల్లు అర్జున్ పక్కా మాస్ రోలో లో నటిస్తున్నట్లు ఆ పోస్టర్ ని బట్టి చూస్తే మనకు అర్ధం అవుతుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా నలభై శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాని దసరా పండుగ సమయంలో రిలీజ్ చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *