145 total views, 1 views today
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ అలవైకుంఠపురములో ఇటీవల విడుదల అయి మంచి సక్సెస్ ని అందుకుంది. ఈ సినిమా కొన్ని చోట్ల అద్భుతమైన కలెక్షన్స్ సాధించి నాన్ బాహుబలి 2 రికార్డు ని అందుకుంది. ఇక అసలు విషయానికి వస్తే, ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఒక్కటే డిస్కషన్ జరుగుతోంది. కరోనా కరోనా కరోనా. ఈ వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే చాలా మంది కరోనా బారిన పడి చనిపోతున్నారు. ఈ వైరస్ చాలా ప్రమాదకరంగా ఉండటంతో ఇటీవల మన భారతదేశం మొత్తం 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా మన టాలీవుడ్ సినిమా పరిశ్రమ ప్రముఖులు కరోనా బాధితుల కోసం తమవంతుగా సాయం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కోటి, సూపర్ స్టార్ మహేష్ బాబు కోటి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు కోట్లు, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నాలుగు కోట్లు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ డెబ్భై ఐదు లక్షలు, మెగా పవర్ స్టార్ రాంచరణ్ డెబ్భై ఐదు లక్షలు, ఇలా అగ్ర హీరోలు అందరు తమవంతు సాయం ప్రకటించారు. ఇక నిన్న స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కూడా తన వంతు సాయంగా కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రకటించి మరొక్కసారి తన ఉదారతను చాటుకున్నారు.