196 total views, 1 views today
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అలవైకుంఠపురములో, ఇటీవల సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా రిలీజ్ అయి మంచి హిట్ కొట్టింది. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ అయితే మరింత గొప్పగా శ్రోతలను అలరించాయి.
ఇప్పటికీ కూడా మంచి ఆదరణతో యూట్యూబ్ లో దూసుకెళ్తున్న ఈ సాంగ్స్ లో సామజవరాగమనా, రాములో రాముల, బుట్ట బొమ్మ సాంగ్స్ అయితే మరింత సక్సెస్ సాధించగా, నేడు కాసేపటి క్రితం అల్లు అర్జున్ కూతురు అర్హ, బుట్ట బొమ్మ సాంగ్ పాడిన వీడియో ని ఆయన భార్య స్నేహ రెడ్డి తన సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఆ వీడియో పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది….!!!