127 total views, 1 views today
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక హాసినీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మించిన భారీ ప్రతిష్టాత్మక సినిమా ‘అలవైకుంఠపురములో’ ఇటీవల సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టింది. ఇక ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ అందించిన సాంగ్స్ యూట్యూబ్ లో ఎంత పెద్ద రికార్డ్స్ ని క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇకపోతే నేడు ఈ సినిమా అతి పెద్ద మ్యూజికల్ సెన్సేషన్ గా ఒక గొప్ప రికార్డు ని సొతం చేసుకుంది. యూట్యూబ్ లోని ఆదిత్య మ్యూజిక్ ఛానల్ ద్వారా రిలీజ్ అయిన ఈ సినిమా సాంగ్స్ 100 మిలియన్లు, 200 మిలియన్ల ఫీట్ అందుకోవడం, అలానే ప్రముఖ సంగీత మాధ్యమం సావన్ లో 100 మిలియన్ల క్లిక్స్, అలానే అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ లో పాన్ ఇండియా రేంజ్ లో 1,3,6 స్థానాల్లో నిలిచి ఎవరూ అందుకోలేని గొప్ప ఫీట్ ని అందుకోవడం జరిగింది. ఇక ఈ సినిమా సక్సెస్ తో అల్లు అర్జున్, త్రివిక్రమ్ ల తో పాటు సంగీత దర్శకుడు థమన్ కు కూడా విపరీతమైన పేరు వచ్చింది…….!!