నిఖిల్ సినిమాకు స్పెషల్ గెస్ట్ గా ‘అల్లు అర్హ’….. వీడియో వైరల్……!!

 141 total views,  1 views today

టాలీవుడ్ నటుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహ రెడ్డి దంపతుల ముద్దుల తనయ అల్లు అర్హ, ఎప్పటికప్పుడు తన తండ్రితో కలిసి సందడి చేస్తూ పలు వీడియోల్లో కనపడడం ఇటీవల గమనించవచ్చు. మొన్న తండ్రి బన్నీని ఏకంగా బే అంటూ సరదాగా సంబోధించిన అర్హ, నేడు యువ నటుడు నిఖిల్ సిద్దార్థ హీరోగా ప్రారంభం అయిన 18 పేజెస్ సినిమాకు ప్రత్యేక అతిథిగా విచ్చేసింది.

 

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా పూజ కార్యక్రమాలు నేడు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు తాతయ్య, నానమ్మలతో కలిసి విచ్చేసిన అర్హ, సెట్ లో ఎంతో సందడి చేసింది. కాగా హీరో నిఖిల్, నేడు మా మూవీ ఓపెనింగ్ స్పెషల్ గెస్ట్ గా ఎవరు వచ్చారో చూడండి అంటూ తాతయ్య అల్లు అరవింద్ తో కలిసి సరదాగా ఆడుకుంటున్న అర్హ ని చూపిస్తూ ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *