కరోనా బాధితులకు అక్షయ్ కుమార్ రూ. 25 కోట్ల భారీ విరాళం…..!!

 128 total views,  2 views today

భారతప్రస్తుతం దేశదేశాలను వణికిస్తున్న మహమ్మారి కరోనా వ్యాధి కట్టడికి ఇప్పటికే చాలా దేశాల్లో లాకౌట్ లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మన దేశాన్ని కూడా ఏకంగా 21 రోజుల పాటు లాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. అయితే కరోనా మహమ్మారి వలన ప్రజలు ఇళ్లకు పరిమిస్తాం అవడంతో దిగువ వర్గాల వారికీ, రోజువారీ కూలీలకు జీవనం గడవడం కష్టం అవుతున్న తరుణంలో ప్రభుత్వాలు వారికి ఆర్ధిక ప్యాకెజీ ప్రకటించడం జరిగింది.

akshay kumar news

అయితే వారికి తమవంతుగా సాయం అందించడానికి పలువురు సినిమా ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇటీవల మన తెలుగు హీరోలు దర్శకులు హీరోయిన్లు నిర్మాతలు సహా మరికొందరు ఎవరికి వీలైనది వారు సాయం చేస్తున్నారు. హీరో అక్షయ్ కుమార్ నిన్న ఏకంగా రూ.25 కోట్ల భారీ విరాళాన్ని ప్రధానమంత్రి కేర్ ఫండ్ కి విరాళంగా ఇచ్చారు. ఎంతో గొప్ప ఔదార్యంతో అంత భారీ విరాళం ప్రకటించడంతో అక్షయ్ పై సర్వత్రా ప్రశంశలు కురుస్తున్నాయి…..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *