129 total views, 1 views today
టాలీవుడ్ యువ నటుడు అక్కినేని అఖిల్, ఐదేళ్ల క్రితం వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అఖిల్ సినిమాతో హీరోగా పరిచయం అవడం జరిగింది. నిజనికి తన చిన్నతనంలోనే సిసింద్రీ సినిమాలో నటించిన అఖిల్, తొలిసారిగా హీరోగా నటించిన అఖిల్ తో పెద్దగా సక్సెస్ ని అందుకోలేకపోయారు. ఆ తరువాత ఆయన నటించిన హలో, అలానే మిస్టర్ మజ్ను సినిమాలు బాగానే ఆడినప్పటికీ, అక్కినేని ఫ్యాన్స్ ఆశించే రేంజ్ విజయాన్ని మాత్రం అవి అందుకోలేకపోయాయి.
ఇక ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో పూజ హెగ్డే హీరోయిన్ గా అఖిల్ నటిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్. ఇక ఈ సినిమా నుండి తొలి సాంగ్ అయిన ‘మనసా మనసా’ అనే పల్లవితో సాగే సాంగ్ ని కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. యువ గాయకుడూ సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ సాంగ్ కు గోపి సుందర్ మ్యూజిక్ అందించడం జరిగింది. మంచి హృద్యమైన మెలోడీగా యువతను ఎంతో ఆకట్టుకుంటున్న ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది…..!!