నాని 27వ సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’ అనౌన్స్మెంట్ ….!!

 84 total views,  1 views today

నాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణం దర్శకత్వంలో ప్రస్తుతం ‘టక్ జగదీష్’ సినిమా తెరకెక్కుతుండడంతో పాటు మరొక హీరో సుధీర్ బాబుతో కలిసి నాని, ‘వి’ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. తన కెరీర్ లో తొలిసారిగా ఈ సినిమా ద్వారా ఒక నెగటివ్ క్యారెక్టర్ లో నటిస్తున్న నాని, నేడు తన 36వ పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. ఇకపోతే నేడు ఆయన పుట్టిన రోజు కానుకగా ఆయన నటించబోయే 27వ సినిమా ప్రకటన కాసేపటి క్రితం రావడం జరిగింది. 

సూర్య దేవర నాగ వంశీ నిర్మాతగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎంతో భారీగా, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో నిర్మితం కాబోయే సినిమా ఈ సినిమాకు ‘శ్యామ్ సింగ రాయ్’ అనే టైటిల్ ని నిర్ణయిస్తూ సినిమా యూనిట్ ఒక వీడియో రిలీజ్ చేసింది. గతంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి టాక్సీ వాలా సినిమా తీసి మంచి సక్సెస్ అందుకున్న రాహుల్ సంకృత్యాన్, ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అతి త్వరలో షూటింగ్ ప్రారంభము కాబోతున్న ఈ సినిమాని రాబోయే క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ చేయనున్నారు. ఈ విధంగా నాని టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు….!! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *